ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే కంప్లీట్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు.. నాలుగో రోజు.. ఐదో రోజు.. ఆరో రోజు వసూళ్లలో వరుసగా ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా ఈ మార్క్ చేరుకున్న తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. రిలీజైన అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ రెండో వారంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా ఈ సినిమాను వీక్షించి ప్రశంసించారు. అనంతరం ఎక్స్‌లో.. “అద్భుతమైన మరియు మరపురాని ప్రదర్శన. అల్లు అర్జున్!! స్క్రీన్‌పై నా దృష్టిని మీ నుండి మరల్చుకోలేకపోయాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది! రష్మికా.. మీరు అద్భుతం. పుష్ప 2 ది రూల్ సూపర్ సక్సెస్ అయినందుకు సుకుమార్, DSP మరియు టీమ్ మొత్తానికి అభినందనలు. అస్సలు తగ్గే లే!!” అని పేర్కొన్నారు.
పుష్ప 2 సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతిబాబు, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, సత్య, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించగా.. కూబా ఫోటోగ్రఫీ సినిమాను మరోస్థాయిలో నిలిబెట్టింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: