స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను ఆమె నేడు వివాహమాడారు. ఈ మేరకు కీర్తి సురేష్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా వెల్లడించారు. తన చిరకాల స్నేహితుడిని పెళ్లాడటం ద్వారా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది కీర్తి సురేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోవా వేదికగా గురువారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో కీర్తి సురేశ్ వివాహ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టియన్ పద్దతిలోనూ మరోసారి వీరు వివాహం జరుపుకోనున్నట్టు సమాచారం. అయితే పెళ్లి డేట్‌ను సీక్రెట్‌గా ఉంచిన కీర్తి సురేష్, తాజాగా తన ఇన్‌స్టా పేజ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో విషయం తెలిసిన సినీ ప్రముఖులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పలువురు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది దీపావళి పర్వదినం సందర్భంగా ఆంటోనీ తట్టిల్ తో తన ప్రేమను తెలియజేసింది కీర్తి. అనంతరం పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: