కోలీవుడ్ స్టార్ హీరో, ‘థలా’ అజిత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విడా ముయార్చి’ అనే భారీ బడ్జెట్ సినిమాలలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ‘మార్క్ ఆంటోనీ’ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు విడా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమనేని డైరెక్షన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రాల అప్‌డేట్‌ల కోసం థలా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో చేతిపై టాటుతో అజిత్ మాస్‌గా కనిపించి అభిమానులను అలరించాడు. అలాగే మరోవైపు విడా ముయార్చి నుంచి అజిత్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ అందించింది చిత్ర యూనిట్.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. విడా ముయార్చిలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశాడు హీరో అజిత్ కుమార్. ఈ మేరకు చిత్ర యూనిట్ సొసైల్ మీడియా వేదికగా.. అజర్‌బైజాన్‌లోని బాకులో అజిత్ డబ్బింగ్ కంప్లీట్ చేశారని ఓ పిక్ షేర్ చేసింది. ఇందులో డబ్బింగ్ స్టూడియోలో చిత్ర యూనిట్‌తో కలిసి అజిత్ స్టైల్ గా నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు.
కాగా విడా ముయార్చి చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు అర్జున్ సర్జా, అరుణ్ విజయ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. కాగా విడా ముయార్చి చిత్రాన్ని వచ్చే జనవరిలో పొంగల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: