బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ర్యాంపేజ్.. 4 డేస్‌ కలెక్షన్స్

Icon Star Allu Arjun's Pushpa 2 The Rule Worldwide Collection on Day 4

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఫీట్ ద్వారా, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో సరికొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న తొలిసినిమాగా నిలిచింది.

విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా అద్భుతమైన రన్ కొనసాగిస్తోంది. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 1,000 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 800 కోట్లు దాటేయడం గమనార్హం. ఈ జోరు ఇలాగె కొనసాగితే మరో రెండు రోజుల్లోనే వెయ్యి కోట్లు అందుకోవడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సంచలన వసూళ్లతో తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి పుష్ప 2 నిరూపించినట్టయింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.