విడుదల పార్ట్ 2 ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

Vidudala Part 2 Telugu Trailer Receives Superb Response

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘విడుదల పార్ట్ 2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్‌ సేతుపతి ఆదివారం చెన్నయ్‌లో విడుదల చేశారు. ఈ చిత్రంలో పెరుమాళ్‌ అనే పాత్రలో విజయ్‌ సేతుపతి అభినయం ఈచిత్రానికి హైలైట్‌గా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

పెరుమాళ్‌ పోరాట వీరుడిగా ఎలా మారాడు అనేది ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రంలో వెట్రీమారన్‌ ప్రజెంట్‌ చేశాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక తెలుగునాట విజయ్‌ సేతుపతికి ఉన్న అభిమాన గణం ఎంతో బలంగా ఉంది. దీంతో తెలుగులోనూ ఈ మూవీ పెద్ద విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.