టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్‌కి గాయాలు అయ్యాయి. ఈ మేరకు ఆయన ఆదివారం కాలుకి గాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి మంచు మౌనిక ఉన్నారు. అయితే పదునైన ఆయుధం కారణంగా ఆయనకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మనోజ్‌కు బలమైన దెబ్బలు తగిలాయని, దాడి చేసినట్లుగా ఉందని మెడికల్ రిపోర్టులో వైద్యులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం సినీ ఇండస్ట్రీ సహా అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక మంచు కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు నెలకొన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనోజ్‌కు, తండ్రికి మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తినట్టు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కాగా మోహన్‌బాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పరిధిలోని ఇంట్లో ఉంటుండగా.. మనోజ్ జల్‌పల్లి లోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. ఈరోజు, రేపట్లో ఈ వ్యవహారంపై స్పష్టత రావొచ్చని అంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: