గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్న చిత్రం ఇటీవలే కర్ణాటకలోని మైసూరులో షూటింగ్ ప్రారంభించుకుంది. 15 రోజులపాటు జరిగిన ఈ మొదటి షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే వీరితోపాటు మరికొందరు ముఖ్య నటులు కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నేడు ప్రారంభమయింది. ఈ షెడ్యూల్‌లో సినిమాలో ముఖ్యమైన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు RC16 బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా షేర్ చేసిన స్పెషల్ వీడియో అభిమానులను అలరిస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ మరియు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు పవర్‌ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. అలాగే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటుడు, ‘మున్నా భయ్యా’ ఫేమ్ దివ్యేందు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక #RC16 సినిమాకు అత్యున్నత సాంకేతికవర్గం సహకారం అందిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేయనున్నారు. ‘ఉప్పెన’తో తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: