గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్టర్ శంకర్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. రామ్ చరణ్, కియారా అద్వానీలపై న్యూజిలాండ్‌లో షూట్ చేసిన ఈ మెలోడీ గీతం అద్భుతంగా వుంది. ఈ పాటకు తెలుగులో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమిళంలో వివేక్, హిందీలో కౌసర్ మునీర్ రచించారు. ఎస్.ఎస్.తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
అయితే తాజాగా ఈ పాట చిత్రీకరణ సమయంలోని రామ్ చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ స్విమ్మింగ్ పూల్‌లో మెడవరకు దిగి ఉండగా.. చిత్ర యూనిట్ షూటింగ్ సన్నాహాల్లో ఉంది. ఈ న్యూ ఫోటోలు చెర్రీ అభిమానులను అలరిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ టీజర్‌తో అంచనాలు పెంచిన చిత్రయూనిట్ మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది.
దీనిలో భాగంగా డిసెంబర్ 21న అమెరికాలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా నిర్వహించబోతోన్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా.. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
అలాగే ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది. ఇక గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: