తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్ రాజుని శాలువాతో సత్కరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక విషయాలను గురించి కొద్దిసేపు చర్చించుకున్నారు. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సుముఖుత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక వీరి కలయికపై తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగా ఫోటోలను, వీడియోను పంచుకుంది.
కాగా నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎఫ్‌డీసీ)గా తాజాగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేయనుంది. త్వరలోనే ఆయన ఈ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: