“మేమంతా సినిమాలు చేసేది.. మీరు ఫ్యామిలీతో థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేసి.. సెలెబ్రేషన్స్‌తో ఇంటికి పంపిద్దామని. కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి” అని పేర్కొన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ఆయన తాజాగా పుష్ప 2 చిత్రం విడుదల నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించారు. ఈ మేరకు మహిళా అభిమాని మృతిపై సంతాపం తెలియజేసిన అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
అసలేమైందంటే..? పుష్ప 2 ప్రీమియర్ చూడటానికి రేవతి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బుధవారం రాత్రి సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. మరోవైపు ఇదే సమయంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మరియు పుష్ప టీమ్‌తో కలిసి మూవీ చూసేందుకు ఈ థియేటర్‌కు వచ్చారు.
అయితే అప్పటికే అక్కడ భారీగా గుమికూడిన అభిమానులు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వీరిని చెరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందారు. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు సీపీఆర్ అందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: