ఓటీటీ లోకి కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Kanguva OTT Platform and Release Date Announced

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో కంగువ ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్ర‌ముఖ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ క్రమంలో డిసెంబ‌ర్ 8న కంగువ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉండనుంది. సో మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో ఈ ఫాంటసీ డ్రామాను మిస్ అయినవారు ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోండి.

కాగా కంగువ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.

కథ:

రష్యాలోని ఓ ల్యాబ్‌లో రహస్యంగా కొందరు పిల్లలను బంధించి, వారిపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ల్యాబ్ నుంచి ఒక పిల్లవాడు తప్పించుకుంటాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్‌ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా జీవితం గడుపుతుంటారు. పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్‌ని వీరు చాకచక్యంగా పట్టుకుని బౌంటీ తీసుకుంటూ ఉంటారు.

ఇక ఏంజెలినా (దిశా పటానీ) ఫ్రాన్సిస్‌ ఒకప్పుడు లవర్స్. కానీ, బ్రేకప్ కావడంతో ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారతారు. ఈ క్రమంలో ల్యాబ్ నుంచి తప్పించుకున్న ఆ పిల్లవాడు గోవాకు చేరుకుని ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఫ్రాన్సిస్‌ కూడా అతడిని చూడగానే ఏదో తెలియని కనెక్షన్ ఫీల్ అవుతాడు. ఇంతలో సడెన్‌గా ఆ బాలుడి ఆచూకీ తెలుసుకుని తీసుకెళ్లడానికి ల్యాబ్ నుంచి మనుషులు వస్తారు.

ఫ్రాన్సిస్ వారితో పోరాడుతూ ఉండగా కథ ఒక్కసారిగా క్రీస్తు శకం 1070కి వెళ్తుంది. అయితే ఆ పిల్లవాడికీ, ఫ్రాన్సిస్‌కి సంబంధం ఏంటి? సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన ఆదివాసీ నాయకుడు (కంగువా) ఎవరు? ఫ్రాన్సిస్‌కి, ఆదివాసీల తెగకూ కనెక్షన్ ఉందా? అసలు ఈ కథలోని ట్విస్టులేంటి? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.