ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఒక్క తెలుగులోనే కాదు మిగితా భాషల్లో కూడా అదరగొడుతుంది.ముఖ్యంగా హిందీ తరువాత తమిళం లో సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.అందులో భాగంగా నిన్న ఈసినిమా తమిళనాడులో 11కోట్ల వసూళ్లను రాబట్టుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంతకుముందు బాహుబలి 2 10.25కోట్ల ఓపెనింగ్స్ తో మొదటి స్థానం లో ఉండేది.ఇన్నాళ్ల తరువాత ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు ఈ ఏడాది తమిళనాడులో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన 8వ సినిమాగా పుష్ప 2 నిలిచింది.ఈజాబితాలో 31కోట్లతో ది గోట్ మొదటి స్థానం లో వుంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.ఇదే జోరు కొనసాగితే పుష్ప 2 ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ దాటనుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను అక్కడ విడుదలచేసింది.
ఇక అటు ఓవర్సీస్ లో పుష్ప 2 ఇప్పటివరకు 4.5మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.అలాగే ఆస్ట్రేలియాలో 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఓవరాల్ గా అన్ని ఏరియాల్లో పుష్ప 2 రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంలా కనిపిస్తుంది.ఇదే జరిగితే అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి సారి ఈ క్లబ్ లో చేరనున్నాడు.ఇప్పట్లో సినిమాలు ఏవి లేకపోవడంతో మరో మూడు వారాల వరకు పుష్ప 2 కు ఎదురువుండకపోవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: