ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య పుష్ప 2 రేపు విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. దీని ద్వారానే రూ.125 కోట్లకు వసూళ్లను సాధించి దూసుకెళ్తోంది. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి 2, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను అధిగమించింది.
ఇదిలావుంటే, మరోవైపు మేకర్స్ పుష్ప 2 ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా చిత్రం రేపు రిలీజ్ కానుండగా, ఈరోజు స్పెషల్ ప్రీమియర్స్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దాదాపు 100 థియేటర్లలో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల కావడానికి ఒకరోజు ముందే పుష్ప 2 హడావిడి కనిపిస్తోంది.
అయితే టికెట్ రేట్లు వెయ్యి రూపాయలకు పైగానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. దీంతో ఈ ప్రీమియర్స్ నిర్వహించే థియేటర్లు అన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. కాగా ఈరోజు రాత్రి 9:30 గంటలకు స్క్రీనింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. దీని తర్వాత అర్ధరాత్రి 1:00 గంటకు తొలి బెనిఫిట్ షో పడనుంది.
ఇక ప్రపపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుండటం, తెలుగు రాష్ట్రాల్లో అధిక టిక్కెట్ ధరలు మరియు ప్రీమియర్ షోల కారణంగా ఈ చిత్రం మొదటి రోజే రూ.300 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూవీపై మంచి హైప్ క్రియేట్ అయిన కారణంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: