శాండల్‌వుడ్ స్టార్ డైరెక్టర్ కం యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కాంతార ప్రీక్వెల్ ‘కాంతార: చాఫ్టర్ 2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకోవైపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీలో హనుమంతుడిగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ అందింది. క్రేజీ బయోపిక్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో ఆయన టైటిల్ పాత్రలో నటించనున్నారు. ఈ క్రమంలో నేడు ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
కాగా ఈ సినిమాకు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ పోస్టర్ గమనిస్తే.. ఖడ్గం చేత బట్టిన శివాజీ మహారాజ్‌గా, వీరత్వం ఉట్టిపడే లుక్‌లో కనిపించారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. కాగా ఈ హిస్టారికల్ డ్రామాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా 2027 జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: