పుష్ప 2.. హైదరాబాద్ నడిబొడ్డున గ్రాండ్‌గా వైల్డ్ ఫైర్ జాతర

Pushpa 2 The Rule Pre Release Event Held Grandly in Hyderabad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది. సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ మూవీ నుండి విడుదలైన నాలుగు లిరికల్ పాటలు కూడా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈవెంట్‌కు బలగంగా నిలవడం జరిగింది. కన్నులపండుగగా జరిగిన ఈ వేడుకలో ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్, చిత్ర దర్శకుడు సుకుమార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ప్రత్యేక గీతంలో నర్తించిన నటి శ్రీలీల, నటి అనసూయ భరద్వాజ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కుబా బ్రోజెక్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

కాగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దిగ్గజ దర్శకుడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, దర్శకులు బుచ్చిబాబు, మలినేని గోపీచంద్, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు. అలాగే కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా అల్లు అర్హ అందరికీ నమస్కారం తెలియజేశారు. అటు పిమ్మట ఓ తెలుగు పద్యాన్ని గుక్క తిప్పకుండా స్టేజి మీద చెప్పడం జరిగింది. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇక అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ మాట్లాడుతూ ప్రేక్షకులను ఉద్దేశించి.. “నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ పుష్ప చాలా బాగుంటాది ఇంకా తగ్గేదెలే” అని చెప్పడంతో అందరూ కేరింతలు కొట్టారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.