మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ కి మరో మూడు రోజులే వుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.ఆలెక్కన ఇంకా రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. నేషన్ వైడ్ గా ఏ రేంజ్ హైప్ వుందో ప్రీ సేల్స్ చూస్తేనే అర్ధమవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తో షోస్ పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పర్మిషన్ రాగ ఆంధ్రప్రదేశ్ లో అనుమతి రావాల్సివుంది.నైజాంలో టికెట్ రేట్స్ ఎక్కువగా వున్నా బుకింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో వున్నాయి.అటు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ అవుతున్నాయి. ఓవరాల్ గా సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ప్రస్తుతం వున్న ట్రెండ్ బట్టి 300కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం సాధ్యమయ్యేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదే జరిగితే ఇండియన్ మూవీ హిస్టరీ లో తొలి రోజు 300కోట్లు కొట్టిన సినిమా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది.600 కోట్లకు పైగా థియేట్రికల్ పైగా బిజినెస్ చేసి పుష్ప 2 ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే 1000 కోట్లకు పైనే రాబట్టాల్సివుంటుంది.సో టార్గెట్ కూడా భారీగానే వుంది.బ్రేక్ ఈవెన్ అయితే అల్లు అర్జున్ మొదటి సారి 1000కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.
ఇక ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ తెరకెక్కించగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: