ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు నేషన్ వైడ్ గా హైప్ ఓ రేంజ్ లో వుంది.ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.టైటిల్ కార్డ్స్ & సెన్సార్ యాడ్స్ అన్ని కలుపుకొని 3గంటల 22నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా యానిమల్ కూడా ఇదే రన్ టైం తో థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ రన్ టైంతో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజైనా సాంగ్స్ &ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇక రిలీజ్ ట్రైలర్ ను కూడా వదలాలనే యోచనలో వున్నారు మేకర్స్.తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇందులోనే ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు కొచ్చి లో పుష్ప 2 ఈవెంట్ జరుగనుంది.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పాట్నా ,చెన్నై లో ఈవెంట్ లు జరుగగా రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి.
సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.దాదాపు 12000స్క్రీన్ లలో ఈసినిమా రిలీజ్ చేయనున్నారు.తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ హైక్ కూడా ఉండనుంది.దాంతో మొదటి రోజు పుష్ప 2 రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























