అప్పుడు మహేష్ బాబు నా భుజంపై చెయ్యి వేసి.. సత్యదేవ్

Actor Satya Dev Interesting Comments on Mahesh Babu Punches in Mufasa The Lion King

మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు స్పెషల్ ట్రీట్‌ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన పోస్టర్‌ను ఆయన సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గ్రాండ్ మీడియా ఈవెంట్ లో లాంచ్ చేశారు. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్‌, టిమోన్‌ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.

ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మన వాయిస్ డిస్నీ లైబ్రెరీలో వుండడం అనేది గ్రేట్ ఎచీవ్మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్న క్యారెక్టర్ చేశాను. ఓ సీన్ లో మహేష్ గారు నా భుజంపై చెయ్యి వేస్తూ మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తర్వాత సరిలేరు నికెవ్వరు లో ఒక క్యారెక్టర్ చేశాను” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు ఆయనతో కలసి టాకా అనే క్యారెక్టర్ కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ లో వుండటం వలన యానిమల్స్ ని చూస్తే తమ్ముడు అన్న అనే ఫీలింగ్ కలిగేది (నవ్వుతూ). ముఫాసా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మహేష్ గారి పంచస్ అద్భుతంగా పేలాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.