ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి ‘పీలింగ్స్’ అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్ సన్సేషన్ అవుతుంది. ఐకాన్ స్టార్ ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలుకుతున్నారు.
ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ తర్వాత చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. ఆపై మరో గ్రాండ్ ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరుగగా.. కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది.
రీసెంట్‌గా బాలీవుడ్ కేంద్రస్థానమైన ముంబైలో కూడా ఒక ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే నేడు మరో ఈవెంట్ నిర్వహించబోతున్నారు మేకర్స్. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పుష్ప 2 వైల్డ్‌ఫైర్ జాతర కార్యక్రమం జరగనుంది. మరికొన్ని గంటల్లోనే ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సహా చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది.
అయితే ఇప్పటివరకూ పుష్ప 2 ఈవెంట్స్ అన్నీ బయట రాష్ట్రాల్లోనే నిర్వహించారు. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేస్తుండటంతో అల్లు అర్జున్ అభిమానులు భారీగా హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు వేదిక పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి పుష్ప 2 వైల్డ్‌ఫైర్ ఈవెంట్ మొదలవనుంది.
మరోవైపు పుష్ప 2 సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అందించింది. టైటిల్ కార్డ్స్, సెన్సార్ యాడ్స్ అన్నీ కలుపుకొని 3గం. 22ని.ల రన్ టైమ్ కలిగివుంది. ఇక ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేయడం మరింత విశేషం.
ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో, ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాపై క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్ లలో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఐమాక్స్ వెర్షన్‌లో కూడా ఈ మూవీని విడుదల చేస్తుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: