ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా గా పుష్ప 2 నిలువడం ఖాయం.హిట్ టాక్ వస్తే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పెట్టనుంది.నిన్నటి తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఈనెల 28లోగా ఫస్ట్ కాపీ రెడీ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ తో పోల్చలేం కానీ సాంగ్స్ అయితే డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం దేవి చేయలేదట.కారణాలు తెలియదు కానీ బ్యాక్ గ్రౌడ్ స్కోర్ కోసం మేకర్స్ తమన్ తో పాటు మరో ఇద్దరిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి.ఇందులో భాగంగా ఫస్ట్ హాఫ్ కు బీజీఎమ్ చేసి ఇచ్చేసాని తమన్ రీసెంట్ గా చెప్పాడు. ఇక ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ పుష్ప 2 పై ఓపెన్ అయ్యాడు.
తన ట్విట్టర్ అకౌంట్ లో పుష్ప 2 పోస్టర్ పోస్ట్ చేసాడు.సో సామ్ సీఎస్ కూడా పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు వర్క్ చేస్తున్నాని చెప్పకనే చెప్పాడు.జాతర ఎపిసోడ్ కు తను బీజీఎమ్ ను కంపోజ్ చేస్తున్నాడని సమాచారం.ఓవరాల్ గా సినిమాలో ఎక్కువగా యాక్షన్ పార్ట్ ఉండడంతో బీజీఎమ్ విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు డైరెక్ట్ సుకుమార్.
ఇక రేపు కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ జరుగనుంది.ఇప్పటివరకు పాట్నా ,చెన్నై లో ఈవెంట్ లు జరుగగా రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి.ఇక రేపు కొచ్చి లో జరుగనుంది.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కుడా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: