పుష్ప 2 నుండి నిన్న వచ్చిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది ఇంకా 24గంటలకు కూడా కాకా ముందే తెలుగులో 25 మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ పొందిన సౌత్ లిరికల్ వీడియో సాంగ్ గా రికార్డును ఖాతాలో వేసుకుంది.ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ ది గోట్ లోని విజిల్ పోడు సాంగ్ 24గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు 18గంటల్లోనే ఆ రికార్డును కిస్సిక్ బ్రేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ విషయానికి వస్తే ఇంతకుముందు మహేష్ బాబు ధమ్ మసాల 17.42మిలియన్ల వ్యూస్ తో 24గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన లిరికల్ వీడియో గా మొదటి స్థానం లో ఉండేది. అయితే కిస్సిక్ కేవలం 13గంటల్లోనే ఆ రికార్డును లేపిసింది.ఇప్పట్లో ఈ రికార్డు ను బీట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.ఇక కిస్సిక్ సాంగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ ప్రస్తుతం రిపీట్ లో వింటే బాగానే వుంది అన్న టాక్ ను తెచ్చుకుంటుంది.దాంతో ఫస్ట్ పార్ట్ లోని స్పెషల్ సాంగ్ ను కిస్సిక్ మ్యాచ్ చేసినట్లే. ఇందులో అల్లు అర్జున్ ,శ్రీ లీల వేసే స్టెప్స్ కు థియేటర్లు ఊగిపోనున్నాయి.
ఇక పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.ఈనెల 28లోపు ఫస్ట్ కాపీ రెడీ కానుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.అటు యుఎస్ఏ లో ఇప్పటికే 50వేలకు పైగా టికెట్స్ తెగాయి.సినిమాకు వున్న హైప్ చూస్తే మొదటి రోజు 300కోట్ల ఓపెనింగ్స్ ఖాయం అయ్యాలనే ఉంది.అదే జరిగితే ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీ గా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది.
సుకుమార్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: