ఈ మట్టికి నేను ఇచ్చే గౌరవం అది

Icon Star Allu Arjun Thanks Tamil Audience at Pushpa 2 Wild Fire Event

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవగా దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌గా నిలిచింది.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్‌ను చేయడం జరిగింది.

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ తన అనుభవాలను, చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఐకాన్ స్టార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. తమిళ ప్రజలందరికీ నా నమస్కారాలు. జీవితంలో నేను మర్చిపోలేని రోజుగా ఈరోజును నేను గుర్తుపెట్టుకుంటాను. నేను సుమారు 20 ఏళ్లుగా సినిమా చేస్తున్నాను. సినిమాలకు ప్రమోషన్లు చేస్తుంటాము.”

“ప్రత్యేకంగా పుష్పాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావడంతో దేశంలో తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నై తో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నా తొలి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలో నేను గడిపాను. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్’.”

“డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు రాబోతున్నాను. నా జీవితంలో ఇంత వైల్డ్‌గా ఎప్పుడూ పని చేసి ఉండను. ఇక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా నా ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడి చెన్నైలో ఈ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నాను. నేను ఇప్పుడు కచ్చితంగా తమిళ్ లోనే మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఈ మట్టికి ఇచ్చే గౌరవం అది.”

“నేను దుబాయ్ కి వెళ్ళినప్పుడు అరబిక్ లో మాట్లాడాలి, కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో మాట్లాడాలి, హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి అనుకుంటాను. అది నేను ఆ నేలకి ఇచ్చే గౌరవంగా భావిస్తాను. మైత్రి మూవీస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను మీరు కాకుండా ఇంకా ఎవరు చేయగలిగే వారు కాదు.”

“మమ్మల్ని ఇంతగా నమ్మి సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి నటీనటులకు నన్ను కృతజ్ఞుణ్ణి. అలాగే ప్రత్యేకంగా రష్మిక గురించి చెప్పాలి.”

“గత నాలుగు సంవత్సరాలుగా నాతో ఈ సినిమా కోసం పని చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు రష్మికకు థాంక్స్. అలాగే స్పెషల్ గెస్ట్ సాంగ్ చేసిన శ్రీలీల చాలా కష్టపడే మనిషి. ఈ చిత్రంలో సాంగ్ డాన్స్ చాలా బాగా చేసింది. అది మీరు స్క్రీన్పై చూస్తే అర్థమవుతుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాను మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది.”

“నేను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకటి సుకుమార్. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే ఒక్క మనిషి పేరు చెప్పాలి అంటే అది కచ్చితంగా సుకుమార్ మాత్రమే.”

“ఆయన చాలా సిన్సియర్ డైరెక్టర్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఎఫెక్ట్స్ అంటూ ప్రతి విషయంలోనూ చాలా క్లియర్ గా సుకుమార్ ఉంటారు. ఇక రెండవది నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. నేను వారిని ఫాన్స్ గా కాదు ఆర్మీ అని పిలుచుకుంటాను. మీరంటే నాకు పిచ్చి. మిమ్మల్నికపై ఇంతగా వీక్షించి దంచుకోలేదు. ఇకనుండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాను. నేను కచ్చితంగా మీ అందరి అంచనాలను ఈ డిసెంబర్ 5వ తేదీన రీచ్ అవుతాం అనుకుంటున్నాను.”

“నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. చిన్నపాటి తప్పులు ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను భాషను గౌరవించే వ్యక్తిని. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏంటో నాకు తెలుసు. అలాగే మీ అంత మంచి యాంకర్ ను నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ నేలకు మరొకసారి నా ధన్యవాదాలు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.