విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ ద్వారా వెంకీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “సంక్రాంతి వస్తున్నాం జనవరి 14న మీ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ వుంది. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ గారితో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్.”
“ఇప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారితో, నాకు ఇష్టమైన దిల్ రాజు గారు, శిరీష్ గారి బ్యానర్ లో మీ అందరినీ నవ్వించడానికి సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నాం. భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్ గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.”
“ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. వెంకటేష్ గారు, నా కాంబినేషన్ హ్యాట్రిక్ ఫిల్మ్ గా రాబోతోంది. లుక్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా టైం స్పెండ్ చేశాం. సుందరకాండ తర్వాత వెంకటేష్ గారు కంప్లీట్ గ్లాసెస్ తో చేసిన సినిమా ఇది. ఇందులో క్లైమాక్స్ లో వన్ మ్యాన్ షో వుంటుంది.”
“ఐశ్వర్య రాజేష్ పాత్ర మీకు గుర్తుండిపోతుంది, మీనాక్షి లో చాలా మంచి ఫన్ టైమింగ్ వుంది. అలాగే ఈ సినిమాలో చేసిన నరేష్ గారితో పాటు అన్నీ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి. రాజు గారి బ్యానర్ అంటే నా బ్యానర్ లా ఫీల్ అవుతుంటాను. వారితో నా ఐదో సినిమా ఇది. రాజు గారి నుంచి మరో సినిమాగా వస్తున్న రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి. అలాగే నా హీరో బాలయ్య బాబు గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి” అని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: