విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే బాలయ్య బాబు గారి ‘డాకు మహారాజ్’ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి.”
“సంక్రాంతికి వస్తున్నాం.. మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాం. తను అనుకున్న కథ, క్యారెక్టర్స్ ని అద్భుతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా రషస్ చూసి నాన్ స్టాప్ గా నవ్వుకున్నాను. నాకు ఎఫ్2 బెస్ట్ సినిమా చెబుతుంటాను. అనిల్ క్యాలెండర్ లో సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. ఐశ్వర్య తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతుంది .మీనాక్షి ఎక్సలెంట్ క్యారెక్టర్ చేస్తుంది.”
“అలాగే వీటి గణేష్ గారు, నరేష్ గారు అందరూ ఈ సినిమాలో మిమ్మల్ని అలరించబోతున్నారు. భీమ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. వెంకటేష్ గారితో అక్కడ మా కోలాబరేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఎఫ్2 సంక్రాంతి వచ్చింది. ఎఫ్ 3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తో పండక్కి వస్తున్నాం. సీతమ్మవాకిట్లో, ఎఫ్2 సినిమాలో ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్ అయ్యాయో సంక్రాంతికి వస్తున్నాం కూడా అంత పెద్ద హిట్ కాబోతోంది.”
“వెంకటేష్ గారు ప్రొడ్యూసర్స్ హీరో సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎంత కంఫర్టబుల్ గా జరుగుతుందో అంత కంఫర్టబుల్ గా ఈ సినిమాని చేశారు. ఒక్క ఇబ్బంది కూడా జరగకుండా ఈ సినిమాని చేసుకున్నారు. జనవరి 14 స్పెషల్ డే. 2025 కొట్టబోతున్నాం” అని అన్నారు దిల్ రాజు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. అలాగే ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: