విడిపోతున్న ఏఆర్ రెహమాన్-సైరా దంపతులు

AR Rahman and Saira Banu Announced Separation After 29 Years of Marriage

ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌-సైరా బాను దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. పెళ్లయిన సుమారు 30 ఏళ్లకు వీరు విడిపోతుండటం గమనార్హం. తాము విడిపోతున్నట్లు తాజాగా ఈ జంట ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈమేరకు రెహమాన్, సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వారి లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మిసెస్ సైరా, ఆమె భర్త అల్లారఖా రెహమాన్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంతో సంఘర్షణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా.. వారి బంధంలో వచ్చిన సమస్యలు, ఉద్రిక్తలు ఇరువురి మధ్య దూరాన్ని పెంచాయి. అందుకే ఇద్దరూ విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఈ నిర్ణయంపై రెహమాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ప‌గిలిన హృద‌యాల‌ను ఆ దేవుడు కూడా మోయ‌లేడ‌ని రెహ్మాన్ త‌న ఎక్స్ అకౌంట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌గిలిన హృద‌యాలు మ‌ళ్లీ అత‌క‌వ‌ని, అయినా కానీ ఓ అర్ధాన్ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చాలా బ‌ల‌హీన‌మైన ద‌శ‌లో త‌మ బంధం ఉంద‌ని, మా ప్రైవ‌సీని గౌర‌వించిన మిత్రుల‌కు థ్యాంక్స్” అని చెప్పారు.

అలాగే వారి తనయుడు అమీన్.. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, తమ తల్లిదండ్రులు విడిపోవాలని తీసుకున్న నిర్ణయం ఎంతో బాధాకరమైనప్పటికీ, వారి నిర్ణయాన్ని గౌరవించాలని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోరారు. కాగా 1995, మార్చి 12న పెద్దల సమక్షంలో రెహమాన్-సైరా నిఖా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఖతీజా, రహీమా మరియు ఒక అబ్బాయి అమీన్ ఉన్నారు. 2022లో కుమార్తె ఖతీజా వివాహం జరిగింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.