టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్‌ను అయితే రాబట్టుకుంది కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపాడు రామ్ పోతినేని. ఈ క్రేజీ ప్రాజెక్టుకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తెరకెక్కించి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా దక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో #RAPO22 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఈనెల 22న లాంచ్ కానుంది. ఈ సందర్భంగా నిన్న విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ మూవీలో నటించనున్న కథానాయికను పరిచయం చేసింది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్టు తెలిపింది.
RAPO22లో హీరో రామ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్టు తెలిపింది. కాగా భాగ్యశ్రీ ఇటీవలే మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వకపోయినా, భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం మంచి గుర్తింపుని ఇచ్చింది. యూత్‌లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ని పెంచేసింది. కాగా ఈ మూవీ రేపు ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: