ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కు మరి కొన్ని రోజులే వుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అలాగే రేపు ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.దాంతో అందరి చూపు ఆ ట్రైలర్ పైనే వుంది.ట్రైలర్ ను బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకొనే రోజులివి.అయితే సినిమాకు వున్నా హైప్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ చూసినా వారు చెపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తను చేయలేదు.ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం లో దేవి కూడా కీలక పాత్ర పోషించాడు.సాంగ్స్ తో పాటు బీజీఎమ్ అదరగొట్టాడు.అయితే కారణాలు తెలియదు కానీ పుష్ప 2 బీజీఎమ్ మాత్రం తను కంపోజ్ చేయడంలేదు.
తమన్ కు ఈబాధ్యత అప్పగించారు.ఇక తమన్ కూడా కేవలం ఫస్ట్ హాఫ్ కు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట.ఈవిషయాన్ని తనే రివీల్ చేశాడు.
పుష్ప 2 చూసి నేను షాక్ అయ్యాను.ఎక్స్ట్రార్డినరీ గా వుంది.రిలీజ్ అయ్యాక అవార్డులు అన్ని అల్లు అర్జున్ వద్దకే పరుగెత్తుకు వస్తాయి.సినిమా మొత్తానికి 15 రోజుల్లో బీజీఎమ్ ఇవ్వమని అడిగారు అయితే తనకు కుదరకపోవడంతో కేవలం ఫస్ట్ హాఫ్ కు మాత్రమే ఇచ్చానని తాజాగా ఓ ఈవెంట్ లో తమన్ వెల్లడించాడు.
ఇక సెకండ్ పార్ట్ కు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సామ్ సీఎస్ ,అజనీష్ లోక్ నాథ్ లను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ కోసం తీసుకున్నారని టాక్ వస్తుంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే నెల 5న ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































