శివ కార్తికేయన్ అమరన్ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. కంగువా ప్రభావం కూడా ఈ సినిమాపై లేదు.దాంతో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తుంది.ఈరోజు బుకింగ్స్ అదిరిపోయాయి.వచ్చే వారంలో 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ లో రీసెంట్ గా మహారాజ,రాయన్ సూపర్ వసూళ్లను దక్కించుకున్నాయి.ఇప్పుడు అమరన్ వాటికి మించి రన్ ను సొంతం చేసుకుంటుంది.పుష్ప 2 వచ్చే వరకు అమరన్ కు అడ్డు ఉండదు.ఇప్పుడిపుడే ఓటిటి లోకి కూడా వచ్చే ఛాన్స్ లేదు.థియేట్రికల్ రెస్పాన్స్ వల్ల ఓటిటి రిలీజ్ ఆలస్యం కానుంది.ఓవరాల్ గా శివ కార్తికేయన్ కెరీర్ లోనే అమరన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అటు తెలుగులో కూడా ఈసినిమా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఫుల్ రన్ లో 40కోట్ల మార్క్ ను చేరుకోనుంది.రీసెంట్ గా ఏ తమిళ సినిమా ఈరేంజ్ వసూళ్లను రాబట్టలేదు.హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.తక్కువకే ఈసినిమాను సొంతం చేసుకోవడం తో బయ్యర్లు భారీ లాభాలు చూస్తున్నారు .
మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























