చిన్నప్పటి నుంచి నేను మెగాస్టార్ ఫ్యాన్‌ని

Matka Director Karuna Kumar Interesting Comments on Mega Family

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మట్కా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. టీం అంతా పాల్గొనగా భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి హాజరై ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ మెగా ఫ్యామిలీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కరుణ కుమార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. నేను వైజాగ్ అల్లుడిని. దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్‌ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు. నిర్మాతలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.”

“వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదల వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్ హౌస్ గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్ లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్ ని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దామనుకున్నాను. వైజాగ్ లో ఒకప్పుడు జరిగిన కథ మట్కా.”

“వైజాగ్ లో నైట్ క్లబ్లు ఉండేవి క్యాబ్రీలు ఉండేవి. అప్పటి మనుషులు అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ఎచీవ్మెంట్లు అన్నీ చూపించాలనుకున్నాను. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. వైజాగ్ లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మట్కా చేయడం జరిగింది. ఈ సినిమా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే వరుణ్ గారు ఓకే చేశారు.”

“నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యాన్ ని. ఒక మెగా అభిమానిగా నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ ని డైరెక్ట్ చేయడం నా సక్సెస్ లో ఒక మైస్టోన్ అనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు గారు. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో అనే ఆలోచన వుండేది. కానీ రెండో రోజే ఆ ఆలోచనలన్నీ పోయాయి.”

“వరుణ్ తేజ్ గారికి శుభ్రత అంటే ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నారు. బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవమంటే తడిసారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరోజు కూడా కంప్లయింట్ చేయకుండా వర్క్ద్ చేశారు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ న భూతో న భవిష్యతి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇది నా ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను.”

“వరుణ్ గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు డాన్సులు చేయాలనుకుంటున్నారో, అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో సింగిల్ షాట్ లో ఒక సీన్ ఉంటుంది. అది తెలుగు సినిమాలో నిలబడి పోయే సీన్ అవుతుంది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. మీనాక్షి, నోరా, జాన్ విజయ్ అందరి పెర్ఫార్మన్సెస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి. విజయవంతం చేయండి” అని అన్నారు దర్శకుడు కరుణకుమార్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.