వరుణ్‌ని కలిస్తే.. కళ్యాణ్‌ గారిని కలిసినట్టే ఉంటుంది

Matka Pre Release Event Actor Satyam Rajesh Praises Hero Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మట్కా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. టీం అంతా పాల్గొనగా భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి హాజరై ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.

ఈ సందర్భంగా యాక్టర్ సత్యం రాజేష్ మాట్లాడుతూ.. “వైజాగ్ ప్రజలందరికీ నమస్కారం. మట్కా ఆడియన్స్ ఊహించి దానికంటే చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్ పక్కా వైజాగ్ మాస్. సినిమా అంతా గోల గోలగా ఉంటుంది. కరణ కుమార్ గారికి నాకు ఎప్పటినుంచో పరిచయం. వరుణ్ తేజ్ గారిని కలిసినప్పుడు నాకెందుకో పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టే ఉంటుంది” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నిర్మాతలు విజయేందర్ రెడ్డి గారికి , రామ్ తాళ్ళూరి గారి కంగ్రాజులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మట్కా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఆడియన్స్ అందరూ చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.