అనుష్క శెట్టి బర్త్ డే.. ఘాటి గ్లింప్స్ రిలీజ్

Ghaati Glimpse Video Released on Anushka Shetty's Birthday

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్వీన్ అనుష్క శెట్టి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తోంది. ‘ఘాటి’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రెండో ప్రాజెక్ట్‌ ఇది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై హై బడ్జెట్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇందులో ట్రెక్కర్లు ఘాట్‌లను నావిగేట్ చేసే బ్రెత్ టేకింగ్ సీన్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. నేటితో షూటింగ్ పార్ట్ పూర్తవుతుండగా.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించుకోనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ వెంచర్‌ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. నేడు అనుష్క జన్మదినం సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెస్ తెలియజేస్తూ గ్లింప్స్ విడుదల చేసింది. అయితే ఈ ఉదయమే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా హీరోయిన్ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుష్క ప్రధానపాత్రలో కనిపించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.