ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “మా ఫ్యామిలీ అంతా అమరన్ సినిమా చూశారు. చాలా ఎమోషనల్ గా నాకు మెసేజ్ పెట్టారు. మా ఇంట్లో అంతా శివకార్తికేయన్ ఫ్యాన్స్. ఆయన సినిమాల్ని రెగ్యులర్ గా చూస్తాం. ఈ సినిమాకి జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాయి పల్లవి గారు నటనలో ఏ ఎమోషన్ అయిన అద్భుతంగా పండించగలరు.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో శివ కార్తికేయన్ గారు ఎప్పుడు ముందుంటారు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ చూపిస్తుంటారు. భీష్మ చూసి దాదాపుగా ఒక అరగంట సేపు మాట్లాడారు. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇంత మంచి విజయాన్ని అందుకున్న అమరన్ టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: