గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే థర్డ్ సింగిల్ విడుదలకానుంది. మరోవైపు గేమ్ ఛేంజర్ టీజర్ ఈనెల 9న లక్నోలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని కీలక అప్‌డేట్స్ అందాయి.
టీజర్ లాంచ్‌తో ప్రమోషనల్ ఈవెంట్స్‌లో జోరు పెంచేసింది గేమ్ ఛేంజర్ టీమ్. దీని తర్వాత నుంచి రిలీజ్ వరకూ నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్ చేయడానికి నిర్ణయించుకుంది. అది కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్ రాజు తాజాగా దీనికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ తర్వాత, అమెరికాలోని డల్లాస్ లో ఒక స్పెషల్ ఈవెంట్ చేయబోతున్నాం. దాని తర్వాత చెన్నైలో మరో ఈవెంట్ నిర్వహిస్తాం. అలాగే జనవరి ఫస్ట్ వీక్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ప్రమోషనల్ కార్యక్రమాలను ఏర్పాటుచేయబోతున్నాం. జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపారు.
ఇక ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది. మరోవైపు చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో క్రీడాంశం నేపథ్యంలో ఆర్‌సీ16 చిత్రంలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: