యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డేకి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ.
ఈ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. “ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు? అని తెలుసుకోవాలని వుంటుంది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇదేవిధంగా తండేల్ రిలీజ్ డేట్ గురించి అరవింద్ గారిని చాలాసార్లు అడిగాను. అయితే దానికి ఆయన ముందు సినిమా చూపించండని అడిగారు. నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది.” అని చెప్పారు.
“సినిమా అంటే ఇలానే తీయాలి. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. వారి కష్టం దేశం అంతా షేక్ చేసింది. మేము ఎడిట్ చూశాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. ఫిబ్రవరి 7 డేట్ పై నేను చాలా సంతోషంగా వున్నాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం. అందరికీ థాంక్ యూ” అని అన్నారు నాగచైతన్య.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























