యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తండేల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపించి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన సత్య మేకింగ్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తండేల్ సినిమా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది. ఈ మేరకు చిత్ర బృందం నేడు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన సందర్భంగా వెల్లడించింది.
కాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వాస్తవ సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్‌గా వుండబోతున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























