మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ వీక్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.6కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్ లోకి ఎంటర్ అయ్యింది. తమిళనాడు లో కూడా నిన్నటి తో టార్గెట్ ను రీచ్ అయ్యింది.కేరళ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. అటు ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్ల క్లబ్ చేరనుంది.దుల్కర్ కు తెలుగులో వరసగా ఇది రెండో బ్లాక్ బాస్టర్.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది. వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈసినిమాను నిర్మించాయి.
వెంకీ అట్లూరి రైటింగ్ & డైరెక్షన్ , దుల్కర్ నటన , జివి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఇక దుల్కర్ ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం ఈసినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇది కూడా హిట్ అయితే దుల్కర్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: