యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ అక్కినేని అభిమానులను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. బన్నీ వాస్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అరవింద్ గారు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. డిసెంబర్ 20న ఈ సినిమా ఎందుకు రాలేదో వివరణ ఇవ్వమని నాకు చెప్పారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ 20న రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. కానీ ఈ సినిమా షూట్ చేయడం చాలా చాలెంజింగ్.”
“సముద్రం పైన జరిగే కథ కాబట్టి చాలా కష్టపడాలి. స్టోరీ ప్రకారం, ఒక తుఫాన్ క్రియేట్ చేయాలి. వేరే దేశాల నావెల్ షిప్ కావాలి. చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. వీటన్నిటితో పాటు ఏదైతే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని మేము ఆడియన్స్ కి ఇవ్వాలి అనుకున్నాము అలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలంటే మేము టీంకి కి టైం ఇవ్వాలి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.”
“అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను మీరందరూ హ్యాపీగా ఫీలయ్యే ప్రోడక్ట్ ఫిబ్రవరి 7న మీకు మీకు అందిస్తాం. చైతన్య గారు 100% లవ్ సినిమాలో ఫస్ట్ టైం నిర్మాతగా నా పేరు వేసిన వ్యక్తి. నన్ను ప్రొడ్యూసర్ గా యాక్సెప్ట్ చేసిన హీరో. ఆయన నాకు ప్రొడ్యూసర్ గా ట్యాగ్ ఇచ్చారు. దానికి బదులుగా నేను ఒక్కటే ఇవ్వగలను. తండేల్ సినిమాను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాం. దానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.”
“అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను. మంచి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళండి మంచి షర్టు కొనుక్కోండి. కాలర్ ని బాగా ఐరన్ చేయించండి. ఫిబ్రవరి 7 మార్నింగ్ షో చూసిన తర్వాత మీ కాలర్ ఎత్తే రోజది. మీ కాలర్ని ఎత్తే సినిమానే 100% డెలివర్ చేస్తాం. గీత ఆర్ట్స్ నుంచి మేము ఇస్తున్న పక్కా ప్రామిస్ ఇది. సాయి పల్లవి గారు క్వీన్ ఆఫ్ ది బాక్సాఫీస్. చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్లంతా మాతో ఉన్నప్పుడు ఈ సినిమాని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లడం పెద్ద పని కాదు. 100% తీసుకెళ్తాం. థాంక్యూ సో మచ్” అని అన్నారు నిర్మాత బన్నీ వాస్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: