మచ్ అవైటెడ్ సూర్య కంగువా వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్ లో బిజీ గా వుంది.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈవెంట్ లు ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్నారు.రీసెంట్ గా తెలుగులో అన్ స్టాపబుల్ 2 అలాగే మరో రెండు ఈవెంట్ లలో పాల్గొంది కంగువా టీం. ఇక రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. రేపు పార్క్ హయత్ లో ఈ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కు సూర్య తో పాటు మిగితా టీం హాజరుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై తమిళం లోనే కాదు మిగితా భాషల్లో కూడా మంచి అంచనాలు వున్నాయి.ఇంతకుముందు ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే మరో ట్రైలర్ కూడా విడుదలకానుంది.కంగువాలో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి కంగువా కాగా మరొకటి ఫ్రాన్సిస్.
శివ ఈసినిమాను తెరకెక్కించగా దిశా పటాని హీరోయిన్ గా నటించింది.బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. నవంబర్ 14న కంగువా భారీ స్థాయిలో విడుదలకానుంది.సుమారు 10000 స్క్రీన్ లలో రిలీజ్ అవుతుంది.దాంతో కంగువా మొదటి రోజు 100కోట్ల ఓపెనింగ్స్ పై కన్నేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: