నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది

Producer Allu Aravind Says, He Feels Sai Pallavi Like His Daughter

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “సాయి పల్లవి అంటే నాకెంతో అభిమానం. తను మంచి డాన్సరే కాదు, మంచి నటి కూడా. ఇటీవలే తను నటించిన ‘అమరన్’ సినిమా చూసాను. క్లైమాక్స్ కి వచ్చేసరికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ సీన్స్ లో పల్లవి ఏడిపించేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చి వెంటనే ఆమెకు కాల్ చేసి అభినందించాను.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాకు ముగ్గురూ కొడుకులే. కూతురు లేదు. ఒకవేళ నాకే కనుక కూతురు ఉండిఉంటే తను సాయి పల్లవిలాగే ఉండేది. ఆమెను నేను ఎప్పుడూ కూతురు లాగే భావిస్తాను. మా తండేల్ సినిమాలో కూడా పల్లవి మంచి పాత్ర పోషించింది. ఈ చిత్రం తనను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి పల్లవి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.