తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం ‘విడుదల’. రికార్డు స్థాయిలో ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్ దర్శకత్వం వహించగా.. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి అదిరిపోయే పెర్ఫార్మన్స్‌కు తోడు, కమెడియన్ సూరి తొలిసారి సీరియస్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికి సీక్వెల్‌గా ‘విడుదల 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ సేతుపతి, సూరి, మంజుల వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తదితరులు నటిస్తున్నారు. వెట్రీ మారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వేల్ రాజ్ డిఓపి అందిస్తుండగా.. ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు.
అతి త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఓ ప్రముఖ సంస్థ దీనిని చేజిక్కించుకుంది. ప్రముఖ నిర్మాత, శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ అధినేత చింతపల్లి రామారావు ఫాన్సీ రేట్‌కు తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: