‘బాహుబలి’ తర్వాత క్వీన్ అనుష్క శెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో ఆమె సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో ఇది రెండవ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హై బడ్జెట్ వెంచర్‌కి టైటిల్ లాక్ చేశారు.
ఈ మేరకు దీనికి ‘ఘాటి’ అనే టైటిల్‌ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ పోస్టర్‌లో ట్రెక్కర్లు ఘాట్‌లను నావిగేట్ చేసే బ్రెత్ టేకింగ్ సీన్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు రోజుల్లో కో-ఇన్సిడెంటల్‌గా అనుష్క పుట్టినరోజుతో పూర్తవబోతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో ఇలా తెలియజేశారు.. “రాణి తన సింహాసనాన్ని తిరిగి పొందేందుకు తిరిగి వస్తోంది. ది క్వీన్, అనుష్క శెట్టి పుట్టినరోజుకి ఇంకో 4 రోజులు మిగిలి ఉన్నాయి. అలాగే ఘాటి షూటింగ్ జర్నీని ముగించడానికి కూడా 4 రోజులే ఉన్నాయి. నవంబర్ 7న మీ క్యాలెండర్‌లను మార్క్ చేయండి. మేజిక్ కోసం వేచి ఉండండి” అని పేర్కొంది.
ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను అందిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్, ఎ స్పెషల్ గ్లింప్స్ ఇన్ టు ది వరల్డ్‌ని రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా అదే రోజు వెల్లడించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: