టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె చివరిసారిగా 2018లో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కనిపించిన విషయం గుర్తుండేవుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
ఈ మూవీ విడుదల తేదీని లాక్ చేసుకుంది. వచ్చే ఏడాది శివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ మేరకు నేడు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కాగా తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: