అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ రిలీజ్

Appudo Ippudo Eppudo Trailer Released

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వ‌సంత్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండగా.. యంగ్ కమెడియన్ హ‌ర్ష చెముడు మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌ల చేసిన మూవీ ఫ‌స్ట్ లుక్‌కి, అలాగే ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 8న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మ్యూజికల్ జర్నీలో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘హే తార’ మరియు సెకండ్ సింగిల్ ‘నీతో ఇలా’ మెలోడియస్‌ పాటలను విడుదల చేయగా, అవి మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేశాయి. ఈ క్ర‌మంలో తాజాగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే చాలా బావుంది.

యూత్‌ను ఆకట్టుకునేలా రొమాన్స్, చ‌క్క‌టి కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. ఇలా అన్ని అంశాల‌తో రూపొందింది. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నట్టు అర్ధమవుతోంది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి నిఖిల్, సుధీర్ వ‌ర్మ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ ప‌క్కా అని అర్ధమవుతోంది.

స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత నిఖిల్-సుధీర్ వ‌ర్మ కాంబోలో వస్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. బాపినీడు.బి స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి సింగ‌ర్ కార్తీక్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నాడు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.