తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్.ఈ దీపావళికి తమిళ్ తోపాటు ఇతర భాషల్లో విడుదలవుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి వచ్చిన రంగులే సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది.శివ కార్తికేయన్ జవాన్ లుక్ ఆకట్టుకుంది.విజువల్స్ అదిరిపోయాయి.వాస్తవిక సంఘటనల ఆధారంగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఎమోషన్స్ వర్క్ అవుట్ అయితే సినిమాకు తిరుగుండదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమరన్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది.
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ విడుదలచేస్తుంది.
అయితే తమిళంలో ఈసినిమా పెద్దగా పోటీ లేకుండానే విడుదలవుతుంది కానీ తెలుగులో మాత్రం భారీ పోటీ ఎదుర్కోనుంది.ఎందుకంటే దీపావళి టార్గెట్ గా తెలుగు నుండి లక్కీ భాస్కర్ ,క సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ఈరెండు సినిమాలకు కూడా మంచి బజ్ వుంది.దాంతో అమరన్ కు పోటీ తప్పకపోవచ్చు.హిందీలో అయితే నవంబర్ 1న అజయ్ దేవగన్, సింగమ్ ఎగైన్ రిలీజ్ కానుంది.దాంతో అమరన్ కు అక్కడ కూడా గట్టి పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: