తెలుగు ఆడియెన్స్ చూపించే లవ్ చాలా స్పెషల్

Amaran Hero Sivakarthikeyan Interesting Comments on Telugu Audience

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివకార్తికేయన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకి థాంక్యూ. మిమ్మల్ని మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పుడూ ఇక్కడికి వచ్చినా మీరు చూపించే లవ్ చాలా స్పెషల్. అందుకే మా టీం ఈసారి ఇలాంటి స్పెషల్ మూవీతో వస్తున్నాం. ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ.”

“అమరన్ ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందుగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి గారు ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది అందరికీ తెలుసు. ఇందులో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చారు. కమల్ హసన్ గారు నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాని మరింత స్పెషల్‌గా మార్చింది. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన కమల్ హాసన్ గారికి థాంక్యూ సో మచ్.”

“ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. మై స్పెషల్ విషెస్ టు నితిన్ బ్రదర్. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఈక్వల్ లవ్ ఎమోషన్ ఉంది. అక్టోబర్ 31 దీపావళి రోజున అందరూ థియేటర్స్‌కి రండి. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ. మీలాంటి స్పెషల్ ఆడియన్స్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి రియల్ హీరో స్టోరీస్ ఇంకెన్నో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ థిస్ ఫిలిం. లవ్ యు ఆల్” అని అన్నారు శివకార్తికేయన్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.