త్వరలో తండేల్‌తో మళ్లీ వస్తాను, అప్పుడు మాట్లాడతా

Amaran Pre Release Event: Actress Sai Pallavi Thanks Telugu Audience

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీ ప్రేమకి థాంక్యూ సో మచ్. నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకి నచ్చాలని చాలా అంకితభావంతో పని చేస్తాను. తెలుగులో నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరికి ఈ సందర్భంగా థాంక్యూ చెప్తున్నాను. అమరన్ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది. చాలా మంచి సినిమా. ఇది రియల్ సోల్జర్ జర్నీ. రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్ కూడా ఇలాగే ఉందని వారు చెప్పారు.” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాని చాలా రియల్‌గా చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ గారు ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తండేల్ సినిమాతో వస్తాను. అప్పుడు మరింత మాట్లాడదాం. నేను ఏ పాత్ర చేసిన ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ ఎప్పుడూ నాకు దొరుకుతుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.