అవి వింటున్నప్పుడు గూప్స్ బంప్స్ వస్తున్నాయి

Swag Director Hasith Goli Thanks Hero Sree Vishnu and Producer TG Vishwa Prasad

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ హసిత్ గోలి నిర్మాతలకు, నటీనటులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ హసిత్ గోలి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమా గురించి పడిన రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. మీడియా, ఆడియన్స్ నుంచి వచ్చిన ఇంత అద్భుతమైన స్పందన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆడియన్స్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.”

“ఈ సినిమాని రాస్తున్నప్పుడు గానీ, తీస్తున్నప్పుడు గానీ బోల్డ్ కంటెంట్ అని అనుకోలేదు. కానీ చూసిన ఆడియన్స్ బోల్డ్ కంటెంట్ అని చెప్పడం చాలా కిక్ ఇచ్చింది. ‘శ్రీ విష్ణు ది గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డెకేడ్’ అనే ప్రశంసలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గూప్స్ బంప్స్ వస్తున్నాయి. నేను శ్రీ విష్ణు ఫ్యాన్ ని. ఆయన గ్రేటెస్ట్ పెర్ఫార్మర్. ఈ సినిమాతో ఆయన యాక్టింగ్ ని మరింత ఎక్స్ ఫ్లోర్ చేసే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది.”

“నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన హీరో శ్రీ విష్ణు గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కథని నా టీం నమ్మకపోతే ఇంత అద్భుతంగా చేసే వాడిని కాదు. నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. ఆడియన్స్ మనందరికంటే స్మార్ట్. థియేటర్స్ టూర్ కి వెళ్ళినప్పుడు ఏలూరు లాంటి ప్రాంతంలో ఫ్రంట్ లో కూర్చున్న ఆడియన్స్ శ్వాగనిక అని పలుకుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. స్మార్ట్ నెస్ అనేది ఆడియన్స్ లో ఉన్నప్పుడే ఇలాంటి రెఫ్లెక్టివ్ కంటెంట్ వస్తుంది. దానికి మేము మర్యాద ఇచ్చామని అనుకుంటున్నాం.”

“అందుకే ఈ ఈవెంట్ కి ‘ఆడియన్స్ విక్టరీ’ అని పేరు పెట్టాం. ఆడియన్స్ గెలవాలని విష్ణు గారు ఈ సినిమా చేశారు. వాళ్ళే గెలిచారు. అదే మాకు ఆనందం. ఈ జర్నీలో నాకు సపోర్టుగా ఉన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. విష్ణు గారితో విశ్వ గారితో ఈ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆడియన్స్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా హౌస్ ఫుల్ గా రన్ అచుతుంది. ఈ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది” అని అన్నారు దర్శకుడు హసిత్ గోలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.