టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ బుధవారం (అక్టోబర్ 9, 2024) జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మాస్ డైరెక్టర్‌గా పేరున్న వినాయక్ దర్శకత్వంలో ఈ ముగ్గురు హీరోలు నటించడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’ చిత్రం రూపొందించిన వినాయక్, ఈ సినిమాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరు కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ఖైదీ నెంబర్ 150’తో మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. అలాగే రామ్ చరణ్‌తో ‘నాయక్’ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు వినాయక్. ఇక ప్రభాస్ కెరీర్లో స్పెషల్ మూవీగా గుర్తింపు పొందిన ‘యోగి’ వినాయక్ దర్శకత్వంలో వచ్చిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























