మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్

Sudheer Babu’s Maa Nanna Superhero Trailer Released

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్నిరోజుల క్రితం మేకర్స్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇక ఇటీవలే నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇటీవలే మా నాన్న సూపర్ హీరో నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘నాన్నా’ అలాగే సెకండ్ సింగల్ ‘వేడుకలో’ అనే పాటలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక రీసెంట్‌గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెన్సార్ బోర్డు ఈ మూవీకి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్ చేసింది. కాగా ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ వేదికగా విడుదల చేయడం విశేషం.

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ ఆద్యంతం ఫుల్ ఎమోషనల్ రైడ్‌లా ఉంది. తండ్రీ, కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించింది. హీరోకు ఇద్దరు తండ్రులు ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఇక సుధీర్ బాబు ఇద్దరు తండ్రులుగా సాయాజీ షిండే, త్రిపురనేని సాయి చంద్ కనిపించారు. వీరిలో సాయాజీ షిండేతో హీరో బంధం అంతంతమాత్రంగా ఉంటే, సాయి చంద్‌తో మాత్రం మంచి బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలావుంది.

కాగా మా నాన్న సూపర్ హీరో చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించగా యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఇక టీజర్ ద్వారా అనౌన్స్ చేసిన విధంగా, ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.