రాజేంద్ర ప్రసాద్‍ కుమార్తె మృతి.. ఎన్టీఆర్ సహా పలువురు సంతాపం

Rajendra Prasad’s Daughter Passed Away Pawan Kalyan, NTR and Other Celebs Mourn

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‍ ఇంట తీవ్ర చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందారు. శుక్రవారం ఆమె అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నేడు గాయత్రి తుదిశ్వాస విడిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కుమార్తె మరణవార్తతో రాజేంద్ర ప్రసాద్‍ ఫ్యామిలీ షాక్‌లో ఉంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్‍ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తోంది. కూతురు మృతిచెందడాన్ని తట్టుకోలేక ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. గతంలో పలు సందర్భాల్లో కుమార్తె గాయత్రి అంటే తనకెంత ఇష్టమో రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు నటుడు రాజేంద్ర ప్రసాద్‍ను పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ వంటి తదితర స్టార్ హీరోలు గాయత్రి మృతికి సంతాపం తెలిపారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా రాజేంద్ర ప్రసాద్‍కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.